Sunday, 29 May 2016

మెటా టేగ్లు (META TAGS ) - వాటి వినియోగం


 




ఇప్పటివరకూ ఈ బ్లాగులో మీరు SEO గురించి తెలుసుకుంటున్న విషయాలు మీకు నచాయి అని ఆశిస్తున్నాను. బ్లాగు ఇప్పటికే తయారుచేసికొని దాని నిర్మాణంపై అవగాహన ఏర్పడిందని ఆశిస్తున్నాను. ఈ బ్లాగులో చెప్పే విషయాలు ఇప్పటికే బ్లాగింగ్ చేస్తున్నవారు, బ్లాగ్ తయారీపై అవగాహన ఉన్నవారికి అర్ధం అవుతాయి .
బ్లాగుగానీ వెబ్సైటు గానీ ఇప్పటికే మీకు ఉంటె మీరు ముందుకు వెళ్ళవచ్చు. లేక పోయినా క్రింది విషయాలు మీ అవగాహనకు ఉపయోగించవచ్చు.
సరే! అసలు విషయానికి వద్దాం...
మీరు ఏదైనా వెబ్ సైట్ ఫైర్ ఫాక్స్ లో తెరవండి. ఇప్పడు మౌస్ తో రైట్ క్లిక్ చేసినప్పుడు view page source ఆప్షన్ కనపడుతుంది ప్రక్క పటంలో లాగ. దానిని క్లిక్ చేయండి .
ఇప్పుడు ఆ సైట్ కు సంబంధించిన html source ఓపెన్ అయింది కదా . దాన్ని గమనించండి మీకు కొన్ని tags కనపడుతాయి. ఇదే రోబోట్ స్పిదర్ లు చదివే బాష అని తెలుసుకున్నాం కదా
ఇక్కడ
<!DOCTYPE html>

<head>
<title></title>
 
. . . 
. 
. . 
. 
</head>
<body>
</body>
</html>
 
 
 పైన తెలుపబడి tags  కామన్ గా ఉంటాయి . వాటిలో  <body></body> tags  మధ్య ఉండేది ఆ వెబ్ సైట్  యొక్క కంటెంట్ ( విషయం ) . 

<head></head>  మధ్య ఉండే టాగ్స్ పై మనం దృష్టి పెడదాం 
 









 పైన ఉన్న రెండు చిత్రాలు చూడండి . జాగ్రత్తగా గమనిస్తే మీకు కొన్ని విషయాలు బొధపదుతాయి.
<title>SEO Optimized Metatags</title> అని ఉంది కదా దీన్ని టైటిల్ టాగ్ అంటారు. 
రెండవ చిత్రంలో సెర్చ్ రిజల్ట్ లో మొదటి లైనుగా కనపడుతున్నది ఇదే . 
ఇప్పుడు మీకు అర్ధం అయిందా టైటిల్ ట్యాగ్ యొక్క ఉద్దేశ్యం !
 
 
 ఇక 
<meta name="Description" content="SEO Optimized Metatags - A simple 
tutorial on Search Engine 
Optimization (SEO ) to learn  what is SEO and various SEO tools 
and techniques including White Hat Black Hat Spamdexing and Meta 
tags Keywords Anchor Title 
Hyperlink Images Web Page optimization and Search Engine 
Crawling Indexing Processing Relevancy Calculation Result Retrieval Cloaking 
Meta Tag Stuffing Doorway Gateway Page Hijacking" />
 
లో ఉన్నది description ట్యాగ్ . ఇది అ వెబ్ సైట్ యొక్క ముఖ్య ఉద్యేశ్యం, దానిలో ఏమి 
ఉంటాయి అనే విషయాలు తెలుపు తుంది 
 
సెర్చ్ రిజల్ట్స్ లో రెండవ లైనుగా ఉన్నది ఇదే ! 
 
ఇవికాక keywords tag అని ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 
కానీ కొన్ని సెర్చ్ ఇంజన్లు దీన్ని కూడా 
ఒక వెబ్ సైట్ ను ఆయా విభాగంలో చేర్చడానికి వినియొగిస్తున్నాయి keywords  tag లో అ వెబ్ సైట్ 
లో ఎక్కువగా కనిపించే పదాలు 
ఉంటాయి 
ఉదా : 
<meta name="keywords" content="andhranews, com, pradesh, 
discussions, andhra"/>
 
మరిన్ని మెటా టాగ్స్ గురించి  మరో పాఠంలో తెలుసుకుందాం . 
 
 
 





Wednesday, 25 May 2016

టైటిల్ స్వేపింగ్( Title Swapping ) - ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన టిప్ !

ఇంతకుముందు పాఠాలలో సెర్చ్ ఇంజిన్ ల గురించి తెలుసుకున్నాం కదా !
సెర్చ్ ఇంజన్లు సాధారణంగా బ్లాగు యొక్క టైటిల్ లోని మొదటి 8-10 పదాలనే తమ రిజల్ట్స్  కోసం తీసుకుంటాయి. అంటే ఒక బ్లాగర్ టపా వ్రాసినప్పుడు ఎంతపెద్ద టైటిల్ పెట్టినా మొదటి 10 పదాల్లోపే ముఖ్యమైన పదాలు ఉండేలా చూసుకోవాలి నిజానికి ఇంకా తక్కువగా 5 పదాల్లోపే ఉండేలా చూసుకోవాలి .
సరే ఇక అసలు విషయం చూద్దాం -
నా బ్లాగుయొక్క టైటిల్ : Search Engine Optimization ( SEO ) in Telugu - తెలుగులో
1. ఒకవేళ నేను  ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన టిప్-  టైటిల్ స్వేపింగ్( Title Swapping ) అనే పేరుతొ ఒక టపా కనుక వ్రాస్తే మామూలుగా క్రిది విధంగా గూగుల్ రిజల్ట్స్ లో వస్తుంది 

. Search Engine Optimization ( SEO ) in Telugu - తెలుగులో -  ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన.... 
ఇక్కడ అసలు పదం మరుగున పడిపోయింది

2. ఒకవేళ నేను   టైటిల్ స్వేపింగ్( Title Swapping ) - ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన టిప్ ! అనే పేరుతొ ఒక టపా కనుక వ్రాస్తే మామూలుగా క్రిది విధంగా గూగుల్ రిజల్ట్స్ లో వస్తుంది 
  Search Engine Optimization ( SEO ) in Telugu - టైటిల్ స్వేపింగ్( Title Swapping ) - .... 
అని వస్తుంది . ఇది బాగానే ఉందా ? 
ఇక్కడ మీకో డవుట్ రావచ్చు ప్రతీ టైటిల్ కు ముందు బ్లాగు టైటిల్ కొన్ని పదాలు ఆక్రమించేస్తుంది కదా మరి చదివేవారు చివరి పదాలవరకూ చదువుతూ టైం వేస్ట్ చేస్తారా అని ! కరెక్టే !!
 అందుకే  టైటిల్ స్వేపింగ్( Title Swapping )  అనేది  తప్పనిసరిగా ప్రతీ బ్లాగర్ చేయాలి అనేది . 
ఇప్పుడు వచ్చే అన్ని templates ఈ టైటిల్ స్వేపింగ్ చేసి వస్తున్నాయి . కానీ బ్లాగర్ లో ఉండే బేసిక్ templates వాడుతున్నవారు ఇది తప్పక చేయాలి 
ఇది చాలా సులభం ! 
  టైటిల్ స్వేపింగ్( Title Swapping ) చేసాక మీ బ్లాగు టపా గూగుల్ రిజల్ట్స్ లో ఇలా కపపడుతుంది 
  టైటిల్ స్వేపింగ్( Title Swapping ) - ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన టిప్ ! -Search Engin..... 
 అంటే మీరు ఏదైతే క్రొత్తగా వ్రాసారో అదంతా ఇక్కడ కనపడుతుంది . 
ఇప్పుడు ఇది ఎలా చెయ్యాలో చూద్దాం -
1. మీ బ్లాగర్ డాష్ బోర్డులో టెంప్లేట్ HTML ఎడిట్ లోకి వెళ్ళండి  
 









2. CONTROL + F అనే కీ బోర్డు బటన్స్ నొక్కడం ద్వారా క్రింది పదాన్ని వెతకండి . ఇది మీ బ్లాగు TEMPLETE  మొదట్లోనే కనిపిస్తుంది
                <title><data:blog.pageTitle/></title> 

 దొరికిందా ? దాన్ని తొలగించి దాని స్థానంలో ఈ క్రింది కోడ్ ను జతచేయండి . 

          <b:if cond='data:blog.pageType == "item"'> <title><data:blog.pageName/> |<data:blog.title/></title> <b:else/> <title><data:blog.pageTitle/></title> </b:if>

       అంతే ! ఇకపై మీ బ్లాగు మంచి సెర్చ్ ఇంజిన్ ర్యాంక్ సాధిస్తుంది . 
నేను ప్రతీరోజూ చూసే అనేక మంచి తెలుగు బ్లాగులలో ఈ టైటిల్   స్వేపింగ్ చెయ్యకపోవడం వల్ల వారు ర్యాంకింగ్ మిస్ అవుతున్నారు . మీరూ వాళ్ళలో ఒకరైతే ప్రయత్నించండి .. లాభాలు పొందండి 

మళ్ళీ కలుద్దాం !  

Thursday, 7 April 2016

యోస్ట్ (yoast SEO) ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సైట్ మేప్ ఎర్రర్ వస్తే ఎం చేయాలి (Simple solution explained in Telugu)

యోస్ట్ (yoast SEO) ప్లగ్ ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సైట్ మేప్  ఎర్రర్ వస్తే ఎం చేయాలి ? క్రింది వీడియో చూడండి


Wednesday, 6 April 2016

మీ బ్లాగర్ డాష్ బోర్డు లో ఈ నోటీసు గమనించారా ? MUST WATCH AND SHARE

క్రింది వీడియో చూడండి !

మనకుదగ్గర్లో ఏది మంచి SEO కంపెనీయో తెలుసుకోవడం ఎలా? Must watch and Share Video

మీకు ఒక వెబ్సైట్ ఉంది ఉంటే, దాన్ని SEO చేయిందామని అనుకున్నారనుకోండి. దానికి ఒక SEO చేసే కంపెనీని వెతుకుతారు కదా ? దీనికి మీ ప్రాంతంలో లేదా మీ రాష్ట్రంలో ఉండే కంపెనీగానీ , ఫ్రీ లాన్సర్ గానీ అయితే మంచిది. వారైతే మీకు అందుబాటులో ఉంటారు . కమ్యూనికేషన్ కుదురుతుంది . ఇలా ఎందుకంటున్నానంటే చాలామంది వారి వెబ్సైట్ SEO ని ఏ అమెరికానో, కెనడాలోనో ఉండే కంపెనీలకు అవుట్ సోర్సింగ్  ఇస్తున్నారు . దీని వల్ల మనీ ఎక్కువగా ఖర్చు అవడమే కాక, గూగుల్  లోకల్ SEO విషయంలో సరైన రిజల్ట్స్ రావు.
అయితే మీ ప్రాంతంలో ఉండే మంచి SEO కంపెనీని వెతికి పట్టుకోవడం ఎలాగో క్రింది వీడియోలో చూడండిః