Showing posts with label seo tips in telugu. Show all posts
Showing posts with label seo tips in telugu. Show all posts

Sunday, 12 June 2016

SEO లో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వెబ్ సైటులు - గూగుల్ లో మొదటి పేజికి రావాలంటే (భాగం- 2)

క్రితంసారి చెప్పిన టపాకు ఇది మరో భాగం . మీ వెబ్సైటు లేదా బ్లాగులో పోస్టు వ్రాసేటప్పుడు ఉపయోగపడే వెబ్సైటులు ఇక్కడ ఇస్తున్నాను .
మీ బ్లాగులో  ఒక టపా వ్రాద్దామని కూర్చున్నారా ? అయితే ఒక్క క్షణం ఆగండి. ఆ టపా ఏ విషయం పై వ్రాద్దామని అనుకుంటున్నారు ? ఒకే సినిమాల గురించి అయితే ఏ "మహేష్ బాబు", వంటలు అయితే "పచ్చడి", రాజకీయాలు అయితే "కేసీయార్" .. సరేనా ! మరి మీరు వ్రాసేది ఎక్కువమంది చదవాలంటే ఎం చేయాలి ? ఎక్కువమంది గూగుల్ లో తమకు కావాల్సిన సమాచారం వెతుకుతూ ఉంటారు. అంటే "మహేష్ బాబు" అని టైప్ చేస్తే గూగుల్ మొదటి పేజిలో మీ బ్లాగు రావాలి అప్పుడు వారు మీ బ్లాగుకు వస్తారు . అలారావాలంటే ఏం చేయాలి ?
క్రింది వెబ్ సైట్ ఓపెన్ చేయండి : https://ubersuggest.io/


దానిలో మహేష్ బాబు అని టైప్ చేయండి. సెర్చ్ చేస్తే రిజల్ట్ క్రింది వింధంగా రిజల్ట్ వస్తుంది .



 దీనిలో ఆ పదానికి సరిపోయే , ఎక్కువగా వెతుకుతున్న పదాలు ఉన్నాయి . వీటినే కీ వర్డ్స్ అంటారు . వీటిని మీ బ్లాగు టపా యొక్క సారాంశం లో అవసరమైన చోట ఉపయోగిస్తూ కనీసం 400 పదాలతో ఒక టపా వ్రాయండి .

బ్లాగు పోస్టు వ్రాసాక ?

సరే మొత్తానికి ఒక బ్లాగు టపా పూర్తి  చేసారుగా .. మరి సెర్చ్ ఇంజన్స్ లో దాన్ని జత చేయాలి ఇప్పుడు . ఎందుకు ?? ఎందుకంటే మీరు టపా వ్రాసినట్లు గూగుల్ కి ఎలా తెలుస్తుంది. ఉదాహరణకు మీరు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు కాలింగ్ బెల్ కొడతారు. కొడితే వాళ్ళు వెంటనే తలుపు తీస్తారు. ఒక వేళ కాలింగ్ బెల్  కొట్టక పొతే ? వారు తలుపు తీసినప్పుడే లోనికి వెళ్ళాలి . అలా అన్నమాట ! గూగుల్ కి సమాచారం అందిస్తే ఆ రోబోట్స్ త్వరగా మీ బ్లాగుకు వస్తాయి . దానికి  క్రింది వెబ్సైటు బాగా ఉపయోగ పడ్తుంది . అలాగే గూగుల్ యొక్క వెబ్ మాస్టర్ టూల్స్ కూడా . వీటి గురించి తర్వాత చెప్పుకుందాం


https://pingler.com/




ఒకే ! ముగించేలొగా మీకు ఉపయోగపడే మరో వెబ్ సైట్ క్రింద ఉంది .


http://www.webpagetest.org/

దీని ద్వారా ప్రపంచంలోని వివిధ ప్రదేశాలనుండి మీ వెబ్ సైట్ యొక్క స్పీడ్ ఎలా ఉందొ చూడొచ్చు . వెబ్సైట్ స్పీడ్ ఐదు సెకన్ల కన్నా తక్కువ , రిక్వెస్ట్ ల సంఖ్య దాదాపు  100  ఉండేలా చూసుకోండి . వివరంగా తర్వాత చూద్దాం. 

Wednesday, 29 January 2014

మీ బ్లాగు వీక్షకులు పెరగాలంటే?

మీరు ఇప్పటికే బ్లాగు ప్రారంభించారు అనుకుందాం . మీ బ్లాగులో రోజూ టపాలు వ్రాస్తుంటారు కదా ! వాటిని చదివేందుకు వీక్షకులు (visitors ) ఎలా వస్తారు ? గూగుల్ సెర్చ్ ద్వారానో , లేక మీ ఫ్రెండ్స్ వస్తే చాలా ? మీ బ్లాగును సెర్చ్ రోబోట్స్ వచ్చి చూసేవరకూ వీక్షకులు రాకపోతే ఎలా ? మీ బ్లాగులో వ్రాసిన విషయాలు పదిమందికీ పంచేందుకు ఆగ్రిగేటర్లు అని కొన్ని సైట్స్ ఉన్నాయి. మీ బ్లాగు ఏ బాషలో వ్రాస్తే అ బాషకు సంబందించిన ఆగ్రిగేటర్  లో మీ బ్లాగును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగులో వీటిని సంకలినిలు అంటారు.అన్ని బ్లాగులకు  ఒకేసారి రాలేనివాళ్ళు ఎలా సంకలినిలను చూస్తుంటారు. ఇవి ఏమి చేస్తాయంటే వాటిల్లో రిజిస్టర్ చేసుకున్న బ్లాగులయొక్క ఫీడ్ ( దీని గురించి మరో టపాలో తెల్సుకుందాం ) లను తమ డేటాబేస్ లో కలిపి వాటినుంచి వచ్చే తాజా టపాలు సమయం ఆధారంగా ఒక పేజిలో ఫై నుండి క్రింది వరకూ వచ్చే ఏర్పాటు చేస్తాయి.
ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆగ్రిగేటర్ లలో మీకు పనికి వచ్చేవి చూద్దాం .
మీ బ్లాగు ఇంగ్లీష్ లో వ్రాసినది అయితే -
1. ఇండీబ్లాగర్
2. బ్లాగ్ ప్రహారీ
3. బ్లాగ్ అడ్డా
4 బ్లాగ్ గిరి
5. టెక్నోరతి

మీ బ్లాగు తెలుగులో వ్రాసినది అయితే -
1. శోధిని
2. కూడలి
3.మాలిక
4. జల్లెడ

Thursday, 9 January 2014

Search Engine Optimization ( SEO ) అంటే ఏమిటి? ( పాఠం-1 )

SEO అంటే Search Engine Optimization .
అసలు Search Engine అంటే ? సెర్చ్  అంటే వెతకడం . engine అంటే యంత్రం . వెతికే యంత్రం లాంటిదన్నమాట . SEO  గురించి తెలుసుకోవాలనుకోవారు . దాదాపు ఇంటర్నెట్ అవగాహన కలిగి ఉంటారు అనే ఉద్దేశ్యంతో కాస్త బేసిక్ విషయాలను వదిలేసి ముందుకు వెళతా . ప్రస్తుతం ఇంటర్నెట్ ఓపెన్ చేసేవారు ముందుగా బ్రౌజరు ఓపెన్ చేయగానే గూగుల్, యాహూ, బింగ్ లాంటి సైట్ లోకి ప్రవెశిస్తారు . లేదా ఆటోమేటిక్ గానే ఏదో ఒక సెర్చ్ పేజి వారి విండో లో కనపడుతుంది . వారికి కావాల్సిన పదాన్ని ఆయా  సెర్చ్ బాక్స్ లో టైపు చెస్తారు. ఉదాహరణకు క్రొత్తగా AAPSC పోస్టులు గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకునేవారు సెర్చ్ బాక్స్ లో APPSC posts అనో APPSC  new posts  అనో టైపు చేస్తారు అనుకొండి . వారికి క్రింది పటంలో చూపబడినట్లు రిజల్ట్స్ వస్తాయి.


పై రిజల్ట్స్ లో యెల్లో మార్కింగ్ చేయబడినది గమనించండి. 2,700,000 రిజల్ట్స్ నుండి అని వచ్చింది . అంటే గూగుల్ తన డైరెక్టరీ నుండి అన్ని పేజి లను వెతికి పట్టింది. వాటిని పేజి కి 10 చొప్పున వివిధ పేజి లలో చూపుతుంది . క్రింది పటం  చూడండి .














ఇలా పేజి నంబర్స్ ఉంటాయి . మొదటి పేజిలో కనిపించే పది రిజల్ట్స్ మీద మాత్రమె వెతికేవారి దృష్టి ఉన్తున్ది. కానీ 2700000 వ రిజల్ట్ పై ఉండదు కదా !
మొదటగా వచ్చే ఆ 10 రిజట్ల్స్ పై దృష్టి పెట్టిన వీక్షకుడు ఏమి చేస్తాడు అనే విషయాన్ని రేపు తెలుసు కుందాం .
ఇప్పుడు క్రింది వీడియో చూడండి .