Wednesday, 1 June 2016

మీ వెబ్ సైట్ గూగుల్ లో రావాలంటే ఏంచేయాలి ? Place your website First in Google

మా చిన్నప్పుడు నేను స్కూల్ లో చదివేటప్పుడు ఏవరేజ్  స్టూడెంట్ ని . ఎలాగోలా టెన్త్ అయిందనిపించి ఆ తర్వాత డిప్లొమా లో జాయిన్ అయ్యాను. అక్కడ వివిధ ప్రదేశాల నుండి వచ్చి చదివే అనేకమంది ఉండేవారు . వారంతా నాకు కొత్త. టెన్త్ వరకూ చదివింది తెలుగు మీడియం , ఇక్కడేమో పూర్తిగా ఇంగ్లీషు ! మొదటి రెండు సెమిష్టర్లూ బాగా తక్కువ మార్కులు వచ్చాయి . మా లెక్చరర్లు మొదటి మూడు ర్యాంకుల వారికీ ఎంతో గౌరవం ఇచ్చేవారు. వాళ్ళని మొదటి బెంచీలో కూర్చోమనేవారు. వారి డౌట్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి చేస్తుండేవారు. దాంతో నాలో ఎలాగైనా మంచి ర్యాంకు తెచ్చుకోవాలనే కసి పెరిగింది. రాత్రనక, పగలనక చదివి మొత్తానికి మూడో సెమిష్టర్ లో ఐదో ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇక చూడండి ఒక్కసారిగా అందరి దృష్టీ నాపై పడింది. ఎవరికైనా డౌట్స్ వస్తే నన్ను కూడా అడగడం, నాతొ స్నేహం చేయడానికి ముందుకు వస్తూండడం మంచి తృప్తిగా ఉండేది అనుకోండి.
SEO అంటూ ఇదంతా ఎందుకు చెప్పానంటే గూగుల్ లో మొదట రావడం కూడా ఇలాంటిదే!
అతి కష్టపడి మొదటి పేజీలోకి వచ్చామా ఇక అందరి దృష్టీ మనపై ఉంటుంది. ముఖ్యంగా గూగుల్ మనల్ని డేగ కళ్ళేలేసుకుని చూస్తుంది . వీడు ఎలా మొదటికి వచ్చాడు, వీదిలో ప్రత్యేకత ఏంటి అంటూ.. నేనంటున్నది మొదటి పేజికి .
మరి మొదటి పేజిలోకి మన బ్లాగు లేదా వెబ్సైట్ రావాలంటే మనం ఏం చేయాలి ?

దీనికి చాలా అంశాలు మిళితమై ఉన్నా కొన్ని ముఖ్యమైనవి తీసుకుందాం .

1. స్వంతంగా వ్రాయాలి 

అంటే కాపీ- పేస్టు లాంటివి ఆపేయాలన్నమాట! కాపీ కొత్తే విద్యార్దులంటే టీచర్ కి  కోపం కదా మరి. ఒక్కోసారి ఇలాంటి కాపీ బ్లాగుల్ని గూగుల్ తన రిజల్ట్స్ లో లేకుండా చేస్తుంది (డిబార్ చెయ్యడం లాగ). అందుకే సాధ్యమైనంత స్వంతంగా వ్రాయండి . ఒక్కడ మనలో మన మాట కాపీ కొట్టినా పటుబడకూడదంటే చదివి అర్ధం చేసుకుని సొంత వాక్యాల్లో వ్రాయండి .. ఓకేనా

2. సారాంశం ఎక్కువగా  వ్రాయండి 

మీరు వ్రాసే టపా కనీసం 450 పదాలు ఉండేలా వ్రాయండి. క్లుప్తంగా ఇచ్చే సమాధానాలకన్నా మన గూగుల్ మాష్టారు వ్యాస రచనకే ఎక్కువ మార్కులు వేస్తారు :)

ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు మరో టపాలో ...

4 comments:

గూగుల్లో మొదటి పేజికి రావడం అన్నారు, అర్ధం కాలేదు, వివరించగోర్తాను.

ఆర్టికల్ బాగుంది ... మరింత వివరించండి.
@sharma - మొదటి పేజి అంటే సెర్చ్ రిజల్ట్స్ లో రావడం.


This is such an great discussion would've love to be there. Thanks for sharing. www.jemereviews.com

Post a Comment