Wednesday, 25 May 2016

టైటిల్ స్వేపింగ్( Title Swapping ) - ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన టిప్ !

ఇంతకుముందు పాఠాలలో సెర్చ్ ఇంజిన్ ల గురించి తెలుసుకున్నాం కదా !
సెర్చ్ ఇంజన్లు సాధారణంగా బ్లాగు యొక్క టైటిల్ లోని మొదటి 8-10 పదాలనే తమ రిజల్ట్స్  కోసం తీసుకుంటాయి. అంటే ఒక బ్లాగర్ టపా వ్రాసినప్పుడు ఎంతపెద్ద టైటిల్ పెట్టినా మొదటి 10 పదాల్లోపే ముఖ్యమైన పదాలు ఉండేలా చూసుకోవాలి నిజానికి ఇంకా తక్కువగా 5 పదాల్లోపే ఉండేలా చూసుకోవాలి .
సరే ఇక అసలు విషయం చూద్దాం -
నా బ్లాగుయొక్క టైటిల్ : Search Engine Optimization ( SEO ) in Telugu - తెలుగులో
1. ఒకవేళ నేను  ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన టిప్-  టైటిల్ స్వేపింగ్( Title Swapping ) అనే పేరుతొ ఒక టపా కనుక వ్రాస్తే మామూలుగా క్రిది విధంగా గూగుల్ రిజల్ట్స్ లో వస్తుంది 

. Search Engine Optimization ( SEO ) in Telugu - తెలుగులో -  ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన.... 
ఇక్కడ అసలు పదం మరుగున పడిపోయింది

2. ఒకవేళ నేను   టైటిల్ స్వేపింగ్( Title Swapping ) - ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన టిప్ ! అనే పేరుతొ ఒక టపా కనుక వ్రాస్తే మామూలుగా క్రిది విధంగా గూగుల్ రిజల్ట్స్ లో వస్తుంది 
  Search Engine Optimization ( SEO ) in Telugu - టైటిల్ స్వేపింగ్( Title Swapping ) - .... 
అని వస్తుంది . ఇది బాగానే ఉందా ? 
ఇక్కడ మీకో డవుట్ రావచ్చు ప్రతీ టైటిల్ కు ముందు బ్లాగు టైటిల్ కొన్ని పదాలు ఆక్రమించేస్తుంది కదా మరి చదివేవారు చివరి పదాలవరకూ చదువుతూ టైం వేస్ట్ చేస్తారా అని ! కరెక్టే !!
 అందుకే  టైటిల్ స్వేపింగ్( Title Swapping )  అనేది  తప్పనిసరిగా ప్రతీ బ్లాగర్ చేయాలి అనేది . 
ఇప్పుడు వచ్చే అన్ని templates ఈ టైటిల్ స్వేపింగ్ చేసి వస్తున్నాయి . కానీ బ్లాగర్ లో ఉండే బేసిక్ templates వాడుతున్నవారు ఇది తప్పక చేయాలి 
ఇది చాలా సులభం ! 
  టైటిల్ స్వేపింగ్( Title Swapping ) చేసాక మీ బ్లాగు టపా గూగుల్ రిజల్ట్స్ లో ఇలా కపపడుతుంది 
  టైటిల్ స్వేపింగ్( Title Swapping ) - ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన టిప్ ! -Search Engin..... 
 అంటే మీరు ఏదైతే క్రొత్తగా వ్రాసారో అదంతా ఇక్కడ కనపడుతుంది . 
ఇప్పుడు ఇది ఎలా చెయ్యాలో చూద్దాం -
1. మీ బ్లాగర్ డాష్ బోర్డులో టెంప్లేట్ HTML ఎడిట్ లోకి వెళ్ళండి  
 









2. CONTROL + F అనే కీ బోర్డు బటన్స్ నొక్కడం ద్వారా క్రింది పదాన్ని వెతకండి . ఇది మీ బ్లాగు TEMPLETE  మొదట్లోనే కనిపిస్తుంది
                <title><data:blog.pageTitle/></title> 

 దొరికిందా ? దాన్ని తొలగించి దాని స్థానంలో ఈ క్రింది కోడ్ ను జతచేయండి . 

          <b:if cond='data:blog.pageType == "item"'> <title><data:blog.pageName/> |<data:blog.title/></title> <b:else/> <title><data:blog.pageTitle/></title> </b:if>

       అంతే ! ఇకపై మీ బ్లాగు మంచి సెర్చ్ ఇంజిన్ ర్యాంక్ సాధిస్తుంది . 
నేను ప్రతీరోజూ చూసే అనేక మంచి తెలుగు బ్లాగులలో ఈ టైటిల్   స్వేపింగ్ చెయ్యకపోవడం వల్ల వారు ర్యాంకింగ్ మిస్ అవుతున్నారు . మీరూ వాళ్ళలో ఒకరైతే ప్రయత్నించండి .. లాభాలు పొందండి 

మళ్ళీ కలుద్దాం !  

5 comments:

Sir,

I am not able to find above first code in my blog what to do.Please help me.

http://telugufinancialschool.blogspot.com/

Your post really helped me.

Surya


Ee same code cheyala or ma blog title pettala

Post a Comment