Sunday, 29 May 2016

మెటా టేగ్లు (META TAGS ) - వాటి వినియోగం


 




ఇప్పటివరకూ ఈ బ్లాగులో మీరు SEO గురించి తెలుసుకుంటున్న విషయాలు మీకు నచాయి అని ఆశిస్తున్నాను. బ్లాగు ఇప్పటికే తయారుచేసికొని దాని నిర్మాణంపై అవగాహన ఏర్పడిందని ఆశిస్తున్నాను. ఈ బ్లాగులో చెప్పే విషయాలు ఇప్పటికే బ్లాగింగ్ చేస్తున్నవారు, బ్లాగ్ తయారీపై అవగాహన ఉన్నవారికి అర్ధం అవుతాయి .
బ్లాగుగానీ వెబ్సైటు గానీ ఇప్పటికే మీకు ఉంటె మీరు ముందుకు వెళ్ళవచ్చు. లేక పోయినా క్రింది విషయాలు మీ అవగాహనకు ఉపయోగించవచ్చు.
సరే! అసలు విషయానికి వద్దాం...
మీరు ఏదైనా వెబ్ సైట్ ఫైర్ ఫాక్స్ లో తెరవండి. ఇప్పడు మౌస్ తో రైట్ క్లిక్ చేసినప్పుడు view page source ఆప్షన్ కనపడుతుంది ప్రక్క పటంలో లాగ. దానిని క్లిక్ చేయండి .
ఇప్పుడు ఆ సైట్ కు సంబంధించిన html source ఓపెన్ అయింది కదా . దాన్ని గమనించండి మీకు కొన్ని tags కనపడుతాయి. ఇదే రోబోట్ స్పిదర్ లు చదివే బాష అని తెలుసుకున్నాం కదా
ఇక్కడ
<!DOCTYPE html>

<head>
<title></title>
 
. . . 
. . 
</head>
<body>
</body>
</html>
 
 
 పైన తెలుపబడి tags  కామన్ గా ఉంటాయి . వాటిలో  <body></body> tags  మధ్య ఉండేది ఆ వెబ్ సైట్  యొక్క కంటెంట్ ( విషయం ) . 

<head></head>  మధ్య ఉండే టాగ్స్ పై మనం దృష్టి పెడదాం 
 









 పైన ఉన్న రెండు చిత్రాలు చూడండి . జాగ్రత్తగా గమనిస్తే మీకు కొన్ని విషయాలు బొధపదుతాయి.
<title>SEO Optimized Metatags</title> అని ఉంది కదా దీన్ని టైటిల్ టాగ్ అంటారు. 
రెండవ చిత్రంలో సెర్చ్ రిజల్ట్ లో మొదటి లైనుగా కనపడుతున్నది ఇదే . 
ఇప్పుడు మీకు అర్ధం అయిందా టైటిల్ ట్యాగ్ యొక్క ఉద్దేశ్యం !
 
 
 ఇక 
<meta name="Description" content="SEO Optimized Metatags - A simple 
tutorial on Search Engine 
Optimization (SEO ) to learn  what is SEO and various SEO tools 
and techniques including White Hat Black Hat Spamdexing and Meta 
tags Keywords Anchor Title 
Hyperlink Images Web Page optimization and Search Engine 
Crawling Indexing Processing Relevancy Calculation Result Retrieval Cloaking 
Meta Tag Stuffing Doorway Gateway Page Hijacking" />
 
లో ఉన్నది description ట్యాగ్ . ఇది అ వెబ్ సైట్ యొక్క ముఖ్య ఉద్యేశ్యం, దానిలో ఏమి 
ఉంటాయి అనే విషయాలు తెలుపు తుంది 
 
సెర్చ్ రిజల్ట్స్ లో రెండవ లైనుగా ఉన్నది ఇదే ! 
 
ఇవికాక keywords tag అని ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 
కానీ కొన్ని సెర్చ్ ఇంజన్లు దీన్ని కూడా 
ఒక వెబ్ సైట్ ను ఆయా విభాగంలో చేర్చడానికి వినియొగిస్తున్నాయి keywords  tag లో అ వెబ్ సైట్ 
లో ఎక్కువగా కనిపించే పదాలు 
ఉంటాయి 
ఉదా : 
<meta name="keywords" content="andhranews, com, pradesh, 
discussions, andhra"/>
 
మరిన్ని మెటా టాగ్స్ గురించి  మరో పాఠంలో తెలుసుకుందాం . 
 
 
 





7 comments:

Nice. keep it up. We are here to know seo

Nice.. very interesting... keep on posting sir..

Bagane undi kani anni of of chepthunnaru

Bagane undi kani anni of of chepthunnaru

If you want tech updates in Telugu then click Tech in telugu

Post a Comment