Tuesday, 21 June 2016

ఒక వెబ్సైట్ పనిచేస్తుందా లేదా తెలుసుకొండి ఇలా

ఫలానా వెబ్సైట్ నా సిస్టమ్ లో రావట్లేదు. ఇది నా కంప్యూటర్ ప్రాబ్లమా లేక ఎవరికీ రావట్లేదా అనుకుంటూ ఉంటారు .
దీనికై క్రింది లింకులోని వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.




Thursday, 16 June 2016

బ్యాక్ లింక్స్ కోసం మీ బ్లాగు టపాలను ఇక్కడ కలపండి | Bookmarking sites list (Dofollow)

బ్యాక్ లిక్స్ అనేవి ఒక బ్లాగుకు గానీ వెబ్సైటుకు గానీ SEOలో చాలా ముఖ్యం. ఒక సైటుకు ఎన్ని ఎక్కువ మంచి బ్యాక్ లింక్స్ ఉంటె ఆ సైట్ అంత  గొప్పది అన్నమాట. ఒక సైట్ లో మీ బ్లాగుకు సంభందించిన లింక్ ఉందంటే ఆ సైట్ మిమ్మల్ని గూగుల్ కు రిఫర్ చేస్తున్నట్లు. బ్యాక్ లింక్స్ రెండు రకాలు. అవి dofollow , nofollow . ఈ బ్యాక్ లింక్స్ గురించి ఇంతకు  ముందు చెప్పుకున్నట్లు గుర్తు. పాత టపాలు ఒకసారి చూడండి లేదా వచ్చే టపాలో మరోసారి చెప్పుకుందాం.
క్రింద చెప్పినవి డూ ఫాలో లింక్స్ ఇచ్చే లింక్ సబ్మిషన్ సైటులు .

Sunday, 12 June 2016

SEO లో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వెబ్ సైటులు - గూగుల్ లో మొదటి పేజికి రావాలంటే (భాగం- 2)

క్రితంసారి చెప్పిన టపాకు ఇది మరో భాగం . మీ వెబ్సైటు లేదా బ్లాగులో పోస్టు వ్రాసేటప్పుడు ఉపయోగపడే వెబ్సైటులు ఇక్కడ ఇస్తున్నాను .
మీ బ్లాగులో  ఒక టపా వ్రాద్దామని కూర్చున్నారా ? అయితే ఒక్క క్షణం ఆగండి. ఆ టపా ఏ విషయం పై వ్రాద్దామని అనుకుంటున్నారు ? ఒకే సినిమాల గురించి అయితే ఏ "మహేష్ బాబు", వంటలు అయితే "పచ్చడి", రాజకీయాలు అయితే "కేసీయార్" .. సరేనా ! మరి మీరు వ్రాసేది ఎక్కువమంది చదవాలంటే ఎం చేయాలి ? ఎక్కువమంది గూగుల్ లో తమకు కావాల్సిన సమాచారం వెతుకుతూ ఉంటారు. అంటే "మహేష్ బాబు" అని టైప్ చేస్తే గూగుల్ మొదటి పేజిలో మీ బ్లాగు రావాలి అప్పుడు వారు మీ బ్లాగుకు వస్తారు . అలారావాలంటే ఏం చేయాలి ?
క్రింది వెబ్ సైట్ ఓపెన్ చేయండి : https://ubersuggest.io/


దానిలో మహేష్ బాబు అని టైప్ చేయండి. సెర్చ్ చేస్తే రిజల్ట్ క్రింది వింధంగా రిజల్ట్ వస్తుంది .



 దీనిలో ఆ పదానికి సరిపోయే , ఎక్కువగా వెతుకుతున్న పదాలు ఉన్నాయి . వీటినే కీ వర్డ్స్ అంటారు . వీటిని మీ బ్లాగు టపా యొక్క సారాంశం లో అవసరమైన చోట ఉపయోగిస్తూ కనీసం 400 పదాలతో ఒక టపా వ్రాయండి .

బ్లాగు పోస్టు వ్రాసాక ?

సరే మొత్తానికి ఒక బ్లాగు టపా పూర్తి  చేసారుగా .. మరి సెర్చ్ ఇంజన్స్ లో దాన్ని జత చేయాలి ఇప్పుడు . ఎందుకు ?? ఎందుకంటే మీరు టపా వ్రాసినట్లు గూగుల్ కి ఎలా తెలుస్తుంది. ఉదాహరణకు మీరు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు కాలింగ్ బెల్ కొడతారు. కొడితే వాళ్ళు వెంటనే తలుపు తీస్తారు. ఒక వేళ కాలింగ్ బెల్  కొట్టక పొతే ? వారు తలుపు తీసినప్పుడే లోనికి వెళ్ళాలి . అలా అన్నమాట ! గూగుల్ కి సమాచారం అందిస్తే ఆ రోబోట్స్ త్వరగా మీ బ్లాగుకు వస్తాయి . దానికి  క్రింది వెబ్సైటు బాగా ఉపయోగ పడ్తుంది . అలాగే గూగుల్ యొక్క వెబ్ మాస్టర్ టూల్స్ కూడా . వీటి గురించి తర్వాత చెప్పుకుందాం


https://pingler.com/




ఒకే ! ముగించేలొగా మీకు ఉపయోగపడే మరో వెబ్ సైట్ క్రింద ఉంది .


http://www.webpagetest.org/

దీని ద్వారా ప్రపంచంలోని వివిధ ప్రదేశాలనుండి మీ వెబ్ సైట్ యొక్క స్పీడ్ ఎలా ఉందొ చూడొచ్చు . వెబ్సైట్ స్పీడ్ ఐదు సెకన్ల కన్నా తక్కువ , రిక్వెస్ట్ ల సంఖ్య దాదాపు  100  ఉండేలా చూసుకోండి . వివరంగా తర్వాత చూద్దాం. 

Wednesday, 1 June 2016

మీ వెబ్ సైట్ గూగుల్ లో రావాలంటే ఏంచేయాలి ? Place your website First in Google

మా చిన్నప్పుడు నేను స్కూల్ లో చదివేటప్పుడు ఏవరేజ్  స్టూడెంట్ ని . ఎలాగోలా టెన్త్ అయిందనిపించి ఆ తర్వాత డిప్లొమా లో జాయిన్ అయ్యాను. అక్కడ వివిధ ప్రదేశాల నుండి వచ్చి చదివే అనేకమంది ఉండేవారు . వారంతా నాకు కొత్త. టెన్త్ వరకూ చదివింది తెలుగు మీడియం , ఇక్కడేమో పూర్తిగా ఇంగ్లీషు ! మొదటి రెండు సెమిష్టర్లూ బాగా తక్కువ మార్కులు వచ్చాయి . మా లెక్చరర్లు మొదటి మూడు ర్యాంకుల వారికీ ఎంతో గౌరవం ఇచ్చేవారు. వాళ్ళని మొదటి బెంచీలో కూర్చోమనేవారు. వారి డౌట్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి చేస్తుండేవారు. దాంతో నాలో ఎలాగైనా మంచి ర్యాంకు తెచ్చుకోవాలనే కసి పెరిగింది. రాత్రనక, పగలనక చదివి మొత్తానికి మూడో సెమిష్టర్ లో ఐదో ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇక చూడండి ఒక్కసారిగా అందరి దృష్టీ నాపై పడింది. ఎవరికైనా డౌట్స్ వస్తే నన్ను కూడా అడగడం, నాతొ స్నేహం చేయడానికి ముందుకు వస్తూండడం మంచి తృప్తిగా ఉండేది అనుకోండి.
SEO అంటూ ఇదంతా ఎందుకు చెప్పానంటే గూగుల్ లో మొదట రావడం కూడా ఇలాంటిదే!
అతి కష్టపడి మొదటి పేజీలోకి వచ్చామా ఇక అందరి దృష్టీ మనపై ఉంటుంది. ముఖ్యంగా గూగుల్ మనల్ని డేగ కళ్ళేలేసుకుని చూస్తుంది . వీడు ఎలా మొదటికి వచ్చాడు, వీదిలో ప్రత్యేకత ఏంటి అంటూ.. నేనంటున్నది మొదటి పేజికి .
మరి మొదటి పేజిలోకి మన బ్లాగు లేదా వెబ్సైట్ రావాలంటే మనం ఏం చేయాలి ?

దీనికి చాలా అంశాలు మిళితమై ఉన్నా కొన్ని ముఖ్యమైనవి తీసుకుందాం .

1. స్వంతంగా వ్రాయాలి 

అంటే కాపీ- పేస్టు లాంటివి ఆపేయాలన్నమాట! కాపీ కొత్తే విద్యార్దులంటే టీచర్ కి  కోపం కదా మరి. ఒక్కోసారి ఇలాంటి కాపీ బ్లాగుల్ని గూగుల్ తన రిజల్ట్స్ లో లేకుండా చేస్తుంది (డిబార్ చెయ్యడం లాగ). అందుకే సాధ్యమైనంత స్వంతంగా వ్రాయండి . ఒక్కడ మనలో మన మాట కాపీ కొట్టినా పటుబడకూడదంటే చదివి అర్ధం చేసుకుని సొంత వాక్యాల్లో వ్రాయండి .. ఓకేనా

2. సారాంశం ఎక్కువగా  వ్రాయండి 

మీరు వ్రాసే టపా కనీసం 450 పదాలు ఉండేలా వ్రాయండి. క్లుప్తంగా ఇచ్చే సమాధానాలకన్నా మన గూగుల్ మాష్టారు వ్యాస రచనకే ఎక్కువ మార్కులు వేస్తారు :)

ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు మరో టపాలో ...