మీరు ఇప్పటికే బ్లాగు ప్రారంభించారు అనుకుందాం . మీ బ్లాగులో రోజూ టపాలు వ్రాస్తుంటారు కదా ! వాటిని చదివేందుకు వీక్షకులు (visitors ) ఎలా వస్తారు ? గూగుల్ సెర్చ్ ద్వారానో , లేక మీ ఫ్రెండ్స్ వస్తే చాలా ? మీ బ్లాగును సెర్చ్ రోబోట్స్ వచ్చి చూసేవరకూ వీక్షకులు రాకపోతే ఎలా ? మీ బ్లాగులో వ్రాసిన విషయాలు పదిమందికీ పంచేందుకు ఆగ్రిగేటర్లు అని కొన్ని సైట్స్ ఉన్నాయి. మీ బ్లాగు ఏ బాషలో వ్రాస్తే అ బాషకు సంబందించిన ఆగ్రిగేటర్ లో మీ బ్లాగును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగులో వీటిని సంకలినిలు అంటారు.అన్ని బ్లాగులకు ఒకేసారి రాలేనివాళ్ళు ఎలా సంకలినిలను...