Sunday, 31 August 2014

గూగుల్ "పేజి ర్యాంక్ " కు మంగళం పాడనుందా ?

చూస్తుంటే అలానే అనిపిస్తుంది . 2013 డిసెంబర్ తర్వాత అసలు గూగుల్ పేజి ర్యాంకుల అప్డేట్ కు ఆసక్తి చూపక పోవడం అనుమానాలకు తావిస్తుంది . గూగుల్ తన టూల్ బార్ లోని పెజిర్యాంకు కూడా నెమ్మదిగా తొలగించాలని చూస్తుంది . ఇప్పటికే కొన్ని బ్రవుజర్లకు సపోర్ట్ చేయకుండా చేసింది . ఇది కావాలని చేసిందా లేక సాంకేతిక లోపమో తెలియరాలేదు . మరి గూగుల్ పేజి ర్యాంక్ లేకపోతె ఒక వెబ్ సైట్ ప్రామాణికతను దేనితో నిర్ణయించాలి ? కాకపొతే గూగుల్ కి చెందిన మాట్ కట్ట్స్ ( Matt  Cutts...

Wednesday, 29 January 2014

మీ బ్లాగు వీక్షకులు పెరగాలంటే?

మీరు ఇప్పటికే బ్లాగు ప్రారంభించారు అనుకుందాం . మీ బ్లాగులో రోజూ టపాలు వ్రాస్తుంటారు కదా ! వాటిని చదివేందుకు వీక్షకులు (visitors ) ఎలా వస్తారు ? గూగుల్ సెర్చ్ ద్వారానో , లేక మీ ఫ్రెండ్స్ వస్తే చాలా ? మీ బ్లాగును సెర్చ్ రోబోట్స్ వచ్చి చూసేవరకూ వీక్షకులు రాకపోతే ఎలా ? మీ బ్లాగులో వ్రాసిన విషయాలు పదిమందికీ పంచేందుకు ఆగ్రిగేటర్లు అని కొన్ని సైట్స్ ఉన్నాయి. మీ బ్లాగు ఏ బాషలో వ్రాస్తే అ బాషకు సంబందించిన ఆగ్రిగేటర్  లో మీ బ్లాగును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగులో వీటిని సంకలినిలు అంటారు.అన్ని బ్లాగులకు  ఒకేసారి రాలేనివాళ్ళు ఎలా సంకలినిలను...

Tuesday, 28 January 2014

SEO పొందుపర్చబడిన కొన్ని బ్లాగర్ టెంప్లేట్లు

చాలామంది ఇప్పటికే బ్లాగు కలిగి ఉండే ఉంటారు. కాకపొతే అ బ్లాగుకు అందంగా ఉందని కొన్ని అనవసర టెంప్లేట్స్  వాడుతూ ఉంటారు. ఇవి బ్లాగు యొక్క లోడ్ టైం ఎక్కువ తీసుకుని అనవసర జావా స్క్రిప్ట్ లనూ, ఇమేజ్ లనూ వివిధ సైట్స్ నుండి తీసుకుంటూ ఉంటాయి . దానివల్ల మీ బ్లాగుకు వచ్చే వీక్షకులు తగ్గిపోతారు . కొందరు రూపొందించిన టెంప్లేట్స్  అయితే వారి వెబ్సైటు కు అనవసర లింకులు ( వీటినే backlinks  అంటారు ) కలిగి ఉంటాయి . మీకోసం SEO పొందుపర్చబడిన కొన్ని...

Friday, 24 January 2014

మీ బ్లాగు అలెక్షా ర్యాంక్ ఈజీగా పెరిగే టెక్నిక్

నేను చెప్పబోయే టెక్నిక్ కేవలం బ్లాగ్ స్పాట్ బ్లాగులకు మాత్రమె . ఎవరైనా మీ బ్లాగు యొక్క అడ్రెస్స్ చెప్పమని అంటే ఏమి చెబుతారు ? ఫలానా xyz.blogspot.com అనా ? లేక xyz.blogspot.in అనా ? చాలామంది మొదటిదే చెబుతారు. ఇంతకీ ఏమిటి ఈ తేడా ? గూగుల్ తన blogspot బ్లాగుల యొక్క సబ్ దొమైన్స్ ను ఏ  దేశం నుండి వీక్షిస్తే ఆయా దేశాల డొమైన్ ఎక్స్ టెన్షన్ పేర్లకు మారెలా మార్పు చేసింది. ఈ మార్పును దాదాపు 15 దేశాలకు ఆయా దేశాల డొమైన్ ఎక్స్ టెన్షన్ లకు మరెలా చెసిన్ది. ఉదాహరణకు అమెరికా నుడి వచ్చే వీక్షకులు తమ దేశంలో .com ఎక్స్ టెన్షన్ తోనూ, ఇండియా వీక్షకులు .ఇన్ తోనూ...

Tuesday, 21 January 2014

వెబ్ పేజిని సెర్చ్ ఇంజన్లు ఎలా చదువుతాయి ?

ముందుగా మీకు నేనో విషయం చెప్పదలచుకున్నా ! ఈ బ్లాగును చదివేవారికి ఖచ్చితంగా బ్లాగు గానీ, వెబ్ సైట్ గానీ ఉండితీరాలి. మీకు లేనట్లయితే వెంటనే కనీసం ఒక బ్లాగు అయినా క్రియేట్ చేసుకోండి. బ్లాగును క్రియేట్ చేసుకోడానికి ఉచిత బ్లాగ్ హోస్టింగ్ సైట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి blogspot.com , wordpress.com . నా దృష్టిలో blogspot.com లోనే బ్లాగ్ తయారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే దీనిలో బ్లాగును మనకు కావాల్సిన విధంగా మలుచుకోవచ్చు . SEO టెక్నిక్ లను సులువుగా...

Tuesday, 14 January 2014

సెర్చ్ ఇంజన్లు ఎలా సమాచారాన్ని సేకరిస్తాయి ?

ఇంటర్నెట్ విస్తృతి పెరిగేకొద్దీ సెర్చ్ ఇంజన్లపై ఆధారపడడం ఎక్కువవుతుంది. సెర్చ్ ఇంజన్ మనకు రిజల్ట్ ఇవ్వాలంటే ముందు అవి ఆయాపేజీలను ఇప్పటికే గుర్తించి  ఉండాలి కదా. . ఇన్ని వేల పేజీల పలితాలను ఇస్తున్న సెర్చ్ ఇంజిన్ తాను అన్ని కోట్ల పేజీలను ఎలా దాచుకోగలుగుతుంది ? ప్రజీ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ రోబోట్స్ ( robots ) అని పిలువబడే ప్రత్యెక సాఫ్ట్వేర్ ఉపయొగిస్తాయి. వీటినే spiders అంటారు. spider  అంటే సాలెపురుగు . web ( సాలెగూడు ) ను అల్లుకుపోతుంది...

Sunday, 12 January 2014

సెర్చ్ ఇంజన్లు ఎలా పనిచేస్తాయి ?

WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్ . మన ప్రపంచాన్ని ఏకం చేసింది, ఏకం చేస్తున్నది ఏమూల ఏమి జరిగినా తక్షణం మనకు అందజేస్తున్నది అదే!. దీన్నే ఇంటర్నెట్ అంటాము. దీనిలో కొన్ని కోట్లాది వెబ్ సైటులు , మిలియన్లకొద్దీ పేజీల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మనకు ఏదైనా విషయం గురించి వివరాలు కావాలంటే అన్ని కోట్ల వెబ్ సైట్స్ చూడలేము కదా. అలా పుట్టుకు వచ్చాయి ఈ సెర్చ్ ఇంజన్లు . ఇంటర్నెట్ లో సమాచారాన్ని వెతికేవారికి సహాయపడడానికి ఇవి ఉన్నాయి. ఒక్కో సెర్చ్ ఇంజన్ ఒక్కో రకంగా...

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ SEO ( పాఠం-2 )

దాదాపు కొన్ని వేల పేజీలలో వచ్చే రిజల్ట్స్ కన్నా మొదటి పేజిలో వచ్చే రిజల్ట్స్ కే వీక్షకుడు ప్రాధాన్యత ఇస్తాడు. అదీ మొదటి resultకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అలా మన బ్లాగు గానీ , వెబ్సైట్ గానీ మొదటి పేజి లో , మొదటి ర్యాంక్ గా వచ్చేలా చేసేదే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ( SEO) మీ బ్లాగు అలా రావాలంటే ఏమి చేయాలో నేర్పడానికే ఈ బ్లాగ్ . సరే మరి ఈ సెర్చ్ ఇంజిన్స్ ర్యాంకింగ్ ఎలా చేస్తాయి? అవి మన బ్లాగును ఎలా గుర్తిస్తాయి? మన బ్లాగును ర్యాంక్ చేయాలంటే ఏమిచేయాలి ? ఈ విషయాలన్నీ క్రొద్ది వారాల్లోనే వివిధ టపాలుగా వ్రాస్తాను. ఈ రోజుకి క్రింది వీడియో చూడండి . ...

Thursday, 9 January 2014

Search Engine Optimization ( SEO ) అంటే ఏమిటి? ( పాఠం-1 )

SEO అంటే Search Engine Optimization . అసలు Search Engine అంటే ? సెర్చ్  అంటే వెతకడం . engine అంటే యంత్రం . వెతికే యంత్రం లాంటిదన్నమాట . SEO  గురించి తెలుసుకోవాలనుకోవారు . దాదాపు ఇంటర్నెట్ అవగాహన కలిగి ఉంటారు అనే ఉద్దేశ్యంతో కాస్త బేసిక్ విషయాలను వదిలేసి ముందుకు వెళతా . ప్రస్తుతం ఇంటర్నెట్ ఓపెన్ చేసేవారు ముందుగా బ్రౌజరు ఓపెన్ చేయగానే గూగుల్, యాహూ, బింగ్ లాంటి సైట్ లోకి ప్రవెశిస్తారు . లేదా ఆటోమేటిక్ గానే ఏదో ఒక సెర్చ్ పేజి వారి విండో లో...