Tuesday 21 January 2014

వెబ్ పేజిని సెర్చ్ ఇంజన్లు ఎలా చదువుతాయి ?



ముందుగా మీకు నేనో విషయం చెప్పదలచుకున్నా ! ఈ బ్లాగును చదివేవారికి ఖచ్చితంగా బ్లాగు గానీ, వెబ్ సైట్ గానీ ఉండితీరాలి. మీకు లేనట్లయితే వెంటనే కనీసం ఒక బ్లాగు అయినా క్రియేట్ చేసుకోండి. బ్లాగును క్రియేట్ చేసుకోడానికి ఉచిత బ్లాగ్ హోస్టింగ్ సైట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి blogspot.com , wordpress.com . నా దృష్టిలో blogspot.com లోనే బ్లాగ్ తయారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే దీనిలో బ్లాగును మనకు కావాల్సిన విధంగా మలుచుకోవచ్చు . SEO టెక్నిక్ లను సులువుగా ఇమిడేలా చేయవచ్చు .వీక్షకులను ఆకర్షించవచ్చు. blogspot.com అనేది గూగుల్ యొక్క బ్లాగింగ్ విభాగం. కనుక గూగుల్ అకౌంట్ మీకు ఉంది తీరాలి. బ్లాగు ఎలా రూపొందించాలి  అనే విషయాలు చెప్పడానికి ఇప్పటికే తెలుగులో అనేక బ్లాగులు ఉన్నాయి.తప్పనిసరిగా బ్లాగుగానీ వెబ్సైటు గానీ ఉంటేనే మీకు SEO గురించి అవగాహన పూర్తిగా ఏర్పడుతుంది. కాకపొతే మన ఈ ప్రయాణంలో కొన్ని ఇతర websites  కూడా వీక్షిస్తాం . 
ఇక సెర్చ్ ఇంజిన్ స్పైడర్లు లేదా రోబోట్ లు వెబ్ పేజి ను ఎలా చదువుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సెర్చ్ ఇంజిన్స్ ఒక వెబ్ సైట్ ను చేరిన తర్వాత ముందుగా అవి వెతికేది సైట్ యొక్క మెయిన్ ఫోల్డర్ లో ఉండే robots.txt  ఫైల్ గురించి. ఈ ఫైల్ ఆ వెబ్ సైట్  లో ఏవే పేజి లు చూడాలో , ఏవి చూడకూడదో సెర్చ్ ఇంజన్ కు చెపుతుంది . ఈ ఫైల్ గురించి తర్వాత మరింత వివరంగా తెలుసుకుందాం.
తర్వాత రోబోట్స్ వెబ్ సైట్ యొక్క హెడర్  <head >కు </head >కు మధ్య ఉన్న వివిధ meta tags ను చదువుతాయి. వాటి ఆదేశాలను అనుసరించి నడుచుకుంటాయి.
ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం - ఒకవేళ robots.txt  ఫైల్ గానీ , మెటా టాగ్స్ గానీ లేకపోతె ? అపుడు సెర్చ్ ఇంజిన్స్  ఈ వెబ్సైటు లో ఉన్న అన్ని లింక్ లనూ చదివి తమలో దాచుకుంటాయి . దీన్నే indexing  అంటారు.
తరువాత రోబోట్స్ <body ></body >లో ఉన్న ప్రతీ అంశాన్నీ చదివి వాటిలో లభించిన కీ వర్డ్స్ , క్రొత్తగా ఏవైనా లభిస్తే తమలో దాచుకుంటాయి ఒకవేళ ఇప్పటికే ఆ content ఎక్కడో చదివినదైతే దాన్ని వదిలేస్తుంది
మొత్తానికి సెర్చ్ ఇంజన్లు వెబ్ సైట్ ను మనం చదివినట్లు కాక దాన్ని HTML ఆధారంగా చదువుతాయి .

0 comments:

Post a Comment