Wednesday 29 January 2014

మీ బ్లాగు వీక్షకులు పెరగాలంటే?

మీరు ఇప్పటికే బ్లాగు ప్రారంభించారు అనుకుందాం . మీ బ్లాగులో రోజూ టపాలు వ్రాస్తుంటారు కదా ! వాటిని చదివేందుకు వీక్షకులు (visitors ) ఎలా వస్తారు ? గూగుల్ సెర్చ్ ద్వారానో , లేక మీ ఫ్రెండ్స్ వస్తే చాలా ? మీ బ్లాగును సెర్చ్ రోబోట్స్ వచ్చి చూసేవరకూ వీక్షకులు రాకపోతే ఎలా ? మీ బ్లాగులో వ్రాసిన విషయాలు పదిమందికీ పంచేందుకు ఆగ్రిగేటర్లు అని కొన్ని సైట్స్ ఉన్నాయి. మీ బ్లాగు ఏ బాషలో వ్రాస్తే అ బాషకు సంబందించిన ఆగ్రిగేటర్  లో మీ బ్లాగును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగులో వీటిని సంకలినిలు అంటారు.అన్ని బ్లాగులకు  ఒకేసారి రాలేనివాళ్ళు ఎలా సంకలినిలను చూస్తుంటారు. ఇవి ఏమి చేస్తాయంటే వాటిల్లో రిజిస్టర్ చేసుకున్న బ్లాగులయొక్క ఫీడ్ ( దీని గురించి మరో టపాలో తెల్సుకుందాం ) లను తమ డేటాబేస్ లో కలిపి వాటినుంచి వచ్చే తాజా టపాలు సమయం ఆధారంగా ఒక పేజిలో ఫై నుండి క్రింది వరకూ వచ్చే ఏర్పాటు చేస్తాయి.
ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆగ్రిగేటర్ లలో మీకు పనికి వచ్చేవి చూద్దాం .
మీ బ్లాగు ఇంగ్లీష్ లో వ్రాసినది అయితే -
1. ఇండీబ్లాగర్
2. బ్లాగ్ ప్రహారీ
3. బ్లాగ్ అడ్డా
4 బ్లాగ్ గిరి
5. టెక్నోరతి

మీ బ్లాగు తెలుగులో వ్రాసినది అయితే -
1. శోధిని
2. కూడలి
3.మాలిక
4. జల్లెడ

Tuesday 28 January 2014

SEO పొందుపర్చబడిన కొన్ని బ్లాగర్ టెంప్లేట్లు

చాలామంది ఇప్పటికే బ్లాగు కలిగి ఉండే ఉంటారు. కాకపొతే అ బ్లాగుకు అందంగా ఉందని కొన్ని అనవసర టెంప్లేట్స్  వాడుతూ ఉంటారు. ఇవి బ్లాగు యొక్క లోడ్ టైం ఎక్కువ తీసుకుని అనవసర జావా స్క్రిప్ట్ లనూ, ఇమేజ్ లనూ వివిధ సైట్స్ నుండి తీసుకుంటూ ఉంటాయి . దానివల్ల మీ బ్లాగుకు వచ్చే వీక్షకులు తగ్గిపోతారు . కొందరు రూపొందించిన టెంప్లేట్స్  అయితే వారి వెబ్సైటు కు అనవసర లింకులు ( వీటినే backlinks  అంటారు ) కలిగి ఉంటాయి . మీకోసం SEO పొందుపర్చబడిన కొన్ని బ్లాగర్ టెంప్లేట్లు అందిస్తున్నాను. ఇవి అందంగానూ SEO ప్రయోగాలకు ఉపయుక్తంగానూ  ఉంటాయి.


1. Fresh Life 2.0 Blogger Template




Fresh Life 2.0




2. Daily 2.0 Blogger Template




Daily 2.0 Blogger Template




3. Jarid Blogger Template




Jarid Blogger Template




4. BS Xtreme Blogger Template




BS Xtreme Blogger Template




5. Word Plus Blogger Template




Word Plus Blogger Template




6. Elice Blogger Template




Elice Blogger Template




7. JP station Blogger Template




JP station Blogger Template




8. Metro Classic Blogger Template




Metro Classic Blogger Template




9. Metro UI Blogger Template




Metro UI Blogger Template




10. Santro Blogger Template




Santro Blogger Template

11.MBT Church Bogger Template

MBT church blogger temlpate 10 Best Premium and SEO Optimized Blogger Templates Download

DEMO | DOWNLOAD

12. Mash 2 BLogger Template

mash 2 blogger template free download 300x231 10 Best Premium and SEO Optimized Blogger Templates Download

DEMO | Download

13.MaggnerMagazine blogger template

Maggner Magazine Style Blogger template free download 300x148 10 Best Premium and SEO Optimized Blogger Templates Download

DEMO | DOWNLOAD

14. Retina Blogger Template

retina blogger template 300x216 10 Best Premium and SEO Optimized Blogger Templates Download

DEMO | DOWNLOAD

15. Tech Shadow Blogger Template

tech shadow beautiful blogger template 300x169 10 Best Premium and SEO Optimized Blogger Templates Download

DEMO | DOWNLOAD

16. MBT Blogger Template

mybloggertricks blogger template 300x148 10 Best Premium and SEO Optimized Blogger Templates Download

DEMO | DOWNLOAD

17. Chronicl Responsive Blogger Template

Chronicl Responsive blogger template 300x188 10 Best Premium and SEO Optimized Blogger Templates Download

 DEMO | DOWNLOAD

18. MaxMag Blogger Template

Max Mag Blogger Template download 300x194 10 Best Premium and SEO Optimized Blogger Templates Download

DEMO | DOWNLOAD

19. Blogism Elegant Blogger Template

Blogism Blogger Template download 300x161 10 Best Premium and SEO Optimized Blogger Templates Download

DEMO | DOWNLOAD

20. Salahuddin Ayubi Blogger Template

salahuddin ayubi blogger template free download 300x182 10 Best Premium and SEO Optimized Blogger Templates Download

DEMO | DOWNLOAD

Friday 24 January 2014

మీ బ్లాగు అలెక్షా ర్యాంక్ ఈజీగా పెరిగే టెక్నిక్

నేను చెప్పబోయే టెక్నిక్ కేవలం బ్లాగ్ స్పాట్ బ్లాగులకు మాత్రమె .
ఎవరైనా మీ బ్లాగు యొక్క అడ్రెస్స్ చెప్పమని అంటే ఏమి చెబుతారు ? ఫలానా xyz.blogspot.com అనా ? లేక xyz.blogspot.in అనా ? చాలామంది మొదటిదే చెబుతారు. ఇంతకీ ఏమిటి ఈ తేడా ?
గూగుల్ తన blogspot బ్లాగుల యొక్క సబ్ దొమైన్స్ ను ఏ  దేశం నుండి వీక్షిస్తే ఆయా దేశాల డొమైన్ ఎక్స్ టెన్షన్ పేర్లకు మారెలా మార్పు చేసింది. ఈ మార్పును దాదాపు 15 దేశాలకు ఆయా దేశాల డొమైన్ ఎక్స్ టెన్షన్ లకు మరెలా చెసిన్ది. ఉదాహరణకు అమెరికా నుడి వచ్చే వీక్షకులు తమ దేశంలో .com ఎక్స్ టెన్షన్ తోనూ, ఇండియా వీక్షకులు .ఇన్ తోనూ ఆస్ట్రేలియా వీక్షకులు .co.uk  ఎక్స్ టెన్షన్ తోనూ మీ బ్లాగును వీక్షిస్తారు. ప్రస్తుతం ఉన్న  ఎక్స్ టెన్షనలు :
 India [blogspot.in], Australia [blogspot.com.au], UK [blogspot.co.uk], Japan [blogspot.jp], New Zealand [blogspot.co.nz], Canada [blogspot.ca], Germany [blogspot.de], Italy [blogspot.it], France [blogspot.fr], Sweden [blogspot.se], Spain [blogspot.com.es], Portugal [blogspot.pt], Brazil [blogspot.com.br], Argentina [blogspot.com.ar], Mexico [blogspot.mx]
గూగుల్ చేసిన ఈ మార్పువల్ల అలెక్సా ర్యాంక్ ఆయా దేశాలకు వేరు వేరు గా ఉంటోంది ఇండియా నుంచి వచ్చే వీక్షకులు ఎక్కువగా ఉంటె ఇండియా ర్యాంక్ ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా తెలుగు బ్లాగులకు ఇండియా వీక్షకులే ఎక్కువ కనుక .in తోనే మంచి ర్యాంక్ ఉంటుంది.
ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ అన్నిరకాల సబ్ దొమైన్స్ ను .com  కు  తీసుకుని వెళ్తాయి ( Redirect ). కనుక
మీ బ్లాగు క్రొత్తది అయితే ఈ టెక్నిక్ ఉపయోగించవచ్చు ఒకవేళ మీ బ్లాగు చాలా పాతది అయితే ఇప్పటికే బ్లాగు ర్యాంక్ మంచి పొజిషన్ లో ఉంది ఉండొచ్చు. కనుక నేను చెప్పబోయేది జాగ్రత్తగా ర్యాంక్ లను చెక్ చేసికొని చెయ్యండి. క్రింది లింక్ ద్వారా మీ బ్లాగు ర్యాంక్ .in  పెట్టి ఒకసారి .com పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ రెండు ర్యాంక్ లకూ తేడా తక్కువగా ఉంటె ఉదా: .in  కు 30 లక్షలు , .com  కు 50 లక్షలు ఉంటె పరవాలేదు అలాకాక .com  కొట్లలో ఉంటె ఈ మార్పు చెయ్యక పోవడమే బెటర్ .
ముందుగా మీ బ్లాగుయొక్క అలెక్షా ర్యాంక్ చెక్ చేసుకోండి.
మీకు ఇప్పటికీ ఈ మార్పు చెయ్యాలి అనిపిస్తే క్రింద చెప్పింది ఫాలో కండి . 
ఈ మార్పు మీబ్లాగును xyz blogspot .com గా ప్రతీ దేశంలోనూ చూపేందుకు 
హెచ్చరికలు  : ఏదైనా దేశంలో blogspot  .com ను నిషేదిస్తే  ఆ దేశంలో మీ బ్లాగు కనపడదు . 
మీ బ్లాగు ఇప్పటికే గూగుల్ సెర్చ్ లో ఇండెక్స్ అయి ఉన్నా, గూగుల్ + , ఫేస్బుక్  లైకులు ఉన్నా అవి ఈ మార్పువల్ల ఎఫెక్ట్ అవుతాయి . 
ఇప్పటికే మీ బ్లాగుకు గూగుల్ పేజి ర్యాంక్ ఉంటె అది కూడా ఎఫెక్ట్ అవుతుంది.
ముందుగా  మీ బ్లాగర్ డాష్బోర్డ్ (dashboard ) లో EDIT  HTML ఆప్షన్ లోకి వెళ్ళండి దానిలో <head > టాగ్ గురించి వెతకండి. దానికి వెంటనే క్రింది కోడ్ కలుపండి . 


<script type="text/javascript">
var blog = document.location.hostname;
var slug = document.location.pathname;
var ctld = blog.substr(blog.lastIndexOf("."));
if (ctld != ".com") {
var ncr = "http://" + blog.substr(0, blog.indexOf("."));
ncr += ".blogspot.com/ncr" + slug;
window.location.replace(ncr);
}
</script>
 
 

ఇప్పుడు  సేవ్  ( SAVE ) క్లిక్ చేయండి . అంటే ఇక నుండి మీ బ్లాగు .com  కు మాత్రమే వెళ్తుంది దీని వల్ల  మీ బ్లాగు అలెక్సా ర్యాంక్ ముందుకన్నా వేగంగా పెరిగుతుంది . 
మరో టిప్ తో మళ్ళీ  కలుద్దాం .  


Tuesday 21 January 2014

వెబ్ పేజిని సెర్చ్ ఇంజన్లు ఎలా చదువుతాయి ?



ముందుగా మీకు నేనో విషయం చెప్పదలచుకున్నా ! ఈ బ్లాగును చదివేవారికి ఖచ్చితంగా బ్లాగు గానీ, వెబ్ సైట్ గానీ ఉండితీరాలి. మీకు లేనట్లయితే వెంటనే కనీసం ఒక బ్లాగు అయినా క్రియేట్ చేసుకోండి. బ్లాగును క్రియేట్ చేసుకోడానికి ఉచిత బ్లాగ్ హోస్టింగ్ సైట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి blogspot.com , wordpress.com . నా దృష్టిలో blogspot.com లోనే బ్లాగ్ తయారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే దీనిలో బ్లాగును మనకు కావాల్సిన విధంగా మలుచుకోవచ్చు . SEO టెక్నిక్ లను సులువుగా ఇమిడేలా చేయవచ్చు .వీక్షకులను ఆకర్షించవచ్చు. blogspot.com అనేది గూగుల్ యొక్క బ్లాగింగ్ విభాగం. కనుక గూగుల్ అకౌంట్ మీకు ఉంది తీరాలి. బ్లాగు ఎలా రూపొందించాలి  అనే విషయాలు చెప్పడానికి ఇప్పటికే తెలుగులో అనేక బ్లాగులు ఉన్నాయి.తప్పనిసరిగా బ్లాగుగానీ వెబ్సైటు గానీ ఉంటేనే మీకు SEO గురించి అవగాహన పూర్తిగా ఏర్పడుతుంది. కాకపొతే మన ఈ ప్రయాణంలో కొన్ని ఇతర websites  కూడా వీక్షిస్తాం . 
ఇక సెర్చ్ ఇంజిన్ స్పైడర్లు లేదా రోబోట్ లు వెబ్ పేజి ను ఎలా చదువుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సెర్చ్ ఇంజిన్స్ ఒక వెబ్ సైట్ ను చేరిన తర్వాత ముందుగా అవి వెతికేది సైట్ యొక్క మెయిన్ ఫోల్డర్ లో ఉండే robots.txt  ఫైల్ గురించి. ఈ ఫైల్ ఆ వెబ్ సైట్  లో ఏవే పేజి లు చూడాలో , ఏవి చూడకూడదో సెర్చ్ ఇంజన్ కు చెపుతుంది . ఈ ఫైల్ గురించి తర్వాత మరింత వివరంగా తెలుసుకుందాం.
తర్వాత రోబోట్స్ వెబ్ సైట్ యొక్క హెడర్  <head >కు </head >కు మధ్య ఉన్న వివిధ meta tags ను చదువుతాయి. వాటి ఆదేశాలను అనుసరించి నడుచుకుంటాయి.
ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం - ఒకవేళ robots.txt  ఫైల్ గానీ , మెటా టాగ్స్ గానీ లేకపోతె ? అపుడు సెర్చ్ ఇంజిన్స్  ఈ వెబ్సైటు లో ఉన్న అన్ని లింక్ లనూ చదివి తమలో దాచుకుంటాయి . దీన్నే indexing  అంటారు.
తరువాత రోబోట్స్ <body ></body >లో ఉన్న ప్రతీ అంశాన్నీ చదివి వాటిలో లభించిన కీ వర్డ్స్ , క్రొత్తగా ఏవైనా లభిస్తే తమలో దాచుకుంటాయి ఒకవేళ ఇప్పటికే ఆ content ఎక్కడో చదివినదైతే దాన్ని వదిలేస్తుంది
మొత్తానికి సెర్చ్ ఇంజన్లు వెబ్ సైట్ ను మనం చదివినట్లు కాక దాన్ని HTML ఆధారంగా చదువుతాయి .

Tuesday 14 January 2014

సెర్చ్ ఇంజన్లు ఎలా సమాచారాన్ని సేకరిస్తాయి ?

ఇంటర్నెట్ విస్తృతి పెరిగేకొద్దీ సెర్చ్ ఇంజన్లపై ఆధారపడడం ఎక్కువవుతుంది. సెర్చ్ ఇంజన్ మనకు రిజల్ట్ ఇవ్వాలంటే ముందు అవి ఆయాపేజీలను ఇప్పటికే గుర్తించి  ఉండాలి కదా. . ఇన్ని వేల పేజీల పలితాలను ఇస్తున్న సెర్చ్ ఇంజిన్ తాను అన్ని కోట్ల పేజీలను ఎలా దాచుకోగలుగుతుంది ? ప్రజీ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ రోబోట్స్ ( robots ) అని పిలువబడే ప్రత్యెక సాఫ్ట్వేర్ ఉపయొగిస్తాయి. వీటినే spiders అంటారు. spider  అంటే సాలెపురుగు . web ( సాలెగూడు ) ను అల్లుకుపోతుంది ఇది. వెబ్ లో ప్రతీమూలా వెతుకుతూ keywords ను తయారు చేయడమో, లేక ఇప్పటికే అది తయారు చేసిన వాటికి క్రొత్త విషయాల్ని జొదించడమో  చెస్తాయి. దీన్ని వెబ్ క్రౌలింగ్ అంటారు . ఈ spiders  ముందుగా ఎక్కువగా ఉపయోగించే సర్వర్లను , ముఖ్యమైన పేజీలతో తమ ప్రయాణాన్ని మొదలెడతాయి. ఈ ప్రయాణంలో తారసపడే ప్రతీ క్రొత్త పదాన్నీ , క్రోత్త  లింక్ నూ  తనలో దాచుకుంటుంది . అసలు ఈ spiders వెబ్ పేజిలను ఎలా చదువుతాయి? వాటికి అన్ని బాషలు వచ్చా ? వచ్చే పాఠం లో ...

Sunday 12 January 2014

సెర్చ్ ఇంజన్లు ఎలా పనిచేస్తాయి ?

WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్ . మన ప్రపంచాన్ని ఏకం చేసింది, ఏకం చేస్తున్నది ఏమూల ఏమి జరిగినా తక్షణం మనకు అందజేస్తున్నది అదే!. దీన్నే ఇంటర్నెట్ అంటాము. దీనిలో కొన్ని కోట్లాది వెబ్ సైటులు , మిలియన్లకొద్దీ పేజీల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మనకు ఏదైనా విషయం గురించి వివరాలు కావాలంటే అన్ని కోట్ల వెబ్ సైట్స్ చూడలేము కదా. అలా పుట్టుకు వచ్చాయి ఈ సెర్చ్ ఇంజన్లు . ఇంటర్నెట్ లో సమాచారాన్ని వెతికేవారికి సహాయపడడానికి ఇవి ఉన్నాయి. ఒక్కో సెర్చ్ ఇంజన్ ఒక్కో రకంగా వెతికే విధానాలు కలిగి ఉన్నా సామాన్యంగా వీటన్నింటికీ క్రింది లక్షణాలు ఉంటాయి .
  • కొన్ని ముఖ్యమైన పదాల అధారంగా ఇవి ఇంటర్నెట్ లోని కోట్లాది పేజి లను వెతుకుతాయి. 
  • పదాలనుబట్టి ఆయా పేజీల సమాచారాన్ని తాము ఎక్కడి నుంచి సేకరించింది , వాటికి మార్గాన్ని కూడా తనలో దాచుకుంటాయి . 
  • వీక్షకుడు ఆయా పదాలను వెతికేటప్పుడు అ పదాలు, పదాల గుంపు ఆధారంగా ఫలితాలు ఇస్తాయి. 
పూర్వం ఈ సెర్చ్ ఇంజన్లు వందల పలితాలనే ఇచ్చేవి ప్రస్తుతం అవి వివిధ పదాలకు కోట్లాది పేజీలను ఇస్తున్నాయి.
ఈ సెర్చ్ ఇంజన్లలో ముఖ్యమైనవి గూగుల్ , బింగ్, యాహూ, బైడూ, ఆస్క్ . ఇవే కాక అనేక వెబ్ సైటులు , బ్లాగులు తమలో సమాచారాన్ని వీక్షకుడు వెతకడానికి సెర్చ్ ఆప్షన్ ను కలిగి ఉంటాయి.

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ SEO ( పాఠం-2 )

దాదాపు కొన్ని వేల పేజీలలో వచ్చే రిజల్ట్స్ కన్నా మొదటి పేజిలో వచ్చే రిజల్ట్స్ కే వీక్షకుడు ప్రాధాన్యత ఇస్తాడు. అదీ మొదటి resultకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అలా మన బ్లాగు గానీ , వెబ్సైట్ గానీ మొదటి పేజి లో , మొదటి ర్యాంక్ గా వచ్చేలా చేసేదే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ( SEO)
మీ బ్లాగు అలా రావాలంటే ఏమి చేయాలో నేర్పడానికే ఈ బ్లాగ్ .
సరే మరి ఈ సెర్చ్ ఇంజిన్స్ ర్యాంకింగ్ ఎలా చేస్తాయి?
అవి మన బ్లాగును ఎలా గుర్తిస్తాయి?
మన బ్లాగును ర్యాంక్ చేయాలంటే ఏమిచేయాలి ?
ఈ విషయాలన్నీ క్రొద్ది వారాల్లోనే వివిధ టపాలుగా వ్రాస్తాను.
ఈ రోజుకి క్రింది వీడియో చూడండి .


Thursday 9 January 2014

Search Engine Optimization ( SEO ) అంటే ఏమిటి? ( పాఠం-1 )

SEO అంటే Search Engine Optimization .
అసలు Search Engine అంటే ? సెర్చ్  అంటే వెతకడం . engine అంటే యంత్రం . వెతికే యంత్రం లాంటిదన్నమాట . SEO  గురించి తెలుసుకోవాలనుకోవారు . దాదాపు ఇంటర్నెట్ అవగాహన కలిగి ఉంటారు అనే ఉద్దేశ్యంతో కాస్త బేసిక్ విషయాలను వదిలేసి ముందుకు వెళతా . ప్రస్తుతం ఇంటర్నెట్ ఓపెన్ చేసేవారు ముందుగా బ్రౌజరు ఓపెన్ చేయగానే గూగుల్, యాహూ, బింగ్ లాంటి సైట్ లోకి ప్రవెశిస్తారు . లేదా ఆటోమేటిక్ గానే ఏదో ఒక సెర్చ్ పేజి వారి విండో లో కనపడుతుంది . వారికి కావాల్సిన పదాన్ని ఆయా  సెర్చ్ బాక్స్ లో టైపు చెస్తారు. ఉదాహరణకు క్రొత్తగా AAPSC పోస్టులు గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకునేవారు సెర్చ్ బాక్స్ లో APPSC posts అనో APPSC  new posts  అనో టైపు చేస్తారు అనుకొండి . వారికి క్రింది పటంలో చూపబడినట్లు రిజల్ట్స్ వస్తాయి.


పై రిజల్ట్స్ లో యెల్లో మార్కింగ్ చేయబడినది గమనించండి. 2,700,000 రిజల్ట్స్ నుండి అని వచ్చింది . అంటే గూగుల్ తన డైరెక్టరీ నుండి అన్ని పేజి లను వెతికి పట్టింది. వాటిని పేజి కి 10 చొప్పున వివిధ పేజి లలో చూపుతుంది . క్రింది పటం  చూడండి .














ఇలా పేజి నంబర్స్ ఉంటాయి . మొదటి పేజిలో కనిపించే పది రిజల్ట్స్ మీద మాత్రమె వెతికేవారి దృష్టి ఉన్తున్ది. కానీ 2700000 వ రిజల్ట్ పై ఉండదు కదా !
మొదటగా వచ్చే ఆ 10 రిజట్ల్స్ పై దృష్టి పెట్టిన వీక్షకుడు ఏమి చేస్తాడు అనే విషయాన్ని రేపు తెలుసు కుందాం .
ఇప్పుడు క్రింది వీడియో చూడండి .